వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీలు కలిసే పోటీ చేయబోతున్నాయి: బండి సంజయ్

-

రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీలు కలిసే పోటీ చేయబోతున్నాయని అన్నారు బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్. ఇరు పార్టీల మధ్య లోపాయికారి గా సీట్ల ఒప్పందం కూడా కుదిరింది అన్నారు. గతంలో బీజేపీ పక్షాన నిరుద్యోగ దీక్ష చేపట్టిన రోజే కాంగ్రెస్ సైతం కార్యక్రమాలు చేపట్టిందని, నిర్మల్ లో బిజెపి బహిరంగ సభ నిర్వహించిన రోజే కాంగ్రెస్ పార్టీ గజ్వేల్లో పోటీగా సభ నిర్వహించిందని అన్నారు. మహబూబ్ నగర్ లో బీజేపీ సభ నిర్వహించిన రోజే పిసిసి ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించిందని తెలిపారు.

Bandi Sanjay Kumar | బండి సంజ‌య్

అయితే తాజాగా బీజేపీ తెలంగాణ శాఖ మూడవ విడత ప్రజాసంకల్పయాత్రను ఆగస్టు 2న ప్రారంభించాలని నిర్ణయిస్తే.. అదే రోజున కాంగ్రెస్ పార్టీ సిరిసిల్లలో రాహుల్ గాంధీతో సభ నిర్వహించడమే అందుకు నిదర్శనమని అన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ఏడాది కాలంలో ప్రజల పక్షాన బీజేపీ ఆందోళనలు, కార్యక్రమాలు నిర్వహించిన అనేకసార్లు పోటీగా కాంగ్రెస్ కార్యకర్తలు కార్యక్రమాలు నిర్వహిన్చిందన్నారు. ఇది ముమ్మాటికీ సీఎం కేసీఆర్ డైరెక్షన్లోనే కాంగ్రెస్ ఆడుతున్న డ్రామా గా భావిస్తున్నామన్నారు. ప్రజల్లో బిజెపికి పెరుగుతున్న గ్రాఫ్ ని తగ్గించేందుకు సీఎం కేసీఆర్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version