అదేంటి పవన్ కల్యాణ్ ఏమో ప్రతిరోజూ..జగన్ కు కౌంటర్ ఇవ్వడానికి చూస్తున్నారు కదా..మరి బాబుకు కౌంటర్ ఏంటని అంతా అనుకోవచ్చు. అయితే ఇక్కడే వేరే కథ ఉంది…మామూలుగా జనసేన అధినేతగా పవన్….వైసీపీ ప్రభుత్వంపై పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే…ప్రజా సమస్యలపై గళం విప్పుతున్నారు. వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలపై నిరసనలు తెలియజేస్తున్నారు. టోటల్ గా పవన్…జగన్ పైనే విమర్శలు చేస్తున్నారు. అటు చంద్రబాబు…జగన్ టార్గెట్ గా ఎలా ముందుకెళుతున్నారో చెప్పాల్సిన పని లేదు.
అయితే ఇలా ఇద్దరు జగన్ పై పోరాటం చేస్తున్నారు..అలాగే ఇద్దరు కలిసి పోటీ చేయాలని చూస్తున్నారు. కానీ ఈ మధ్య పొత్తు విషయంలో కాస్త గ్యాప్ వచ్చిన విషయం తెలిసిందే…ఇద్దరు నేతలు పరోక్షంగా పొత్తుకు అంగీకరించిన సరే..ఇటీవల పవన్ ఏమో.. ఈ సారి టీడీపీ తగ్గాలని మాట్లాడటం. అలాగే పవన్ ని సీఎం అభ్యర్ధిగా ప్రకటించాలని జనసేన శ్రేణులు డిమాండ్ చేయడం చేశాయి. దీంతో టీడీపీ శ్రేణులు రివర్స్ అయ్యాయి..తమకు సింగిల్ గా గెలిచే సత్తా ఉందని, ఈ సారి వార్ వన్ సైడ్ అయిందని చంద్రబాబు మాట్లాడుతున్నారు. దీంతో పవన్ అసలు తమకు ఎవరితో పొత్తు లేదని, ప్రజలతోనే పొత్తు అని అన్నారు.
ఇక పవన్ మాటల తర్వాత బాబు స్పీడ్ పెంచారు. ఈ మధ్య ఆయన వరుసగా సీట్లు కూడా ఫిక్స్ చేసుకుంటూ వచ్చేస్తున్నారు. వాస్తవానికి జనసేనతో గాని పొత్తు ఉంటే…ఆ పార్టీకి కొన్ని సీట్లు ప్రకటించాల్సి ఉంటుంది. కానీ బాబు అవేమీ పట్టించుకోకుండా తమ పార్టీ అభ్యర్ధులని ప్రకటిస్తూ వస్తున్నారు. ఇలా బాబు దూకుడుగా ఉండటంతో…పవన్ సైతం అదే శైలిలో బాబుకు కౌంటర్ ఇవ్వాలని చూస్తున్నారు.
తాను కూడా తమకు బలం ఉన్న నియోజకవర్గాల్లో అభ్యర్ధులని ప్రకటించేయాలని చూస్తున్నారు. ముఖ్యంగా టీడీపీ బలంగా ఉన్న కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన సీట్లు ఫిక్స్ చేయాలని పవన్ భావిస్తున్నారట. ఎలాగో దసరా నుంచి పవన్ రాజకీయాల్లో ఫుల్ యాక్టివ్ గా ఉంటారు…అప్పటినుంచే వరుసగా అభ్యర్ధులని ఫిక్స్ చేస్తూ…బాబుకు కౌంటర్ ఇవ్వాలని చూస్తున్నారట.