కాంగ్రెస్ పార్టీ తాజాగా రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించింది. వచ్చే నెల 10వ తేదీన జరిగే రాజ్యసభ ఎన్నికల కోసం కాంగ్రెస్ ఆదివారం పది మంది అభ్యర్థులను ప్రకటించింది. కేంద్ర మాజీ మంత్రి పీ చిదంబరాన్ని తమిళనాడు నుంచి రంగంలోకి దింపింది. పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సూర్జేవాలా, ప్రధాన కార్యదర్శి ముకుల్ వాస్నిక్, ఉత్తరప్రదేశ్ నేత ప్రమోద్ తివారి లను రాజస్థాన్ నుంచి పోటీకి నిలిపింది. కర్ణాటక నుంచి జైరాం రమేష్ కు, మధ్యప్రదేశ్ నుంచి వివేక్ బంకాలకు అవకాశం కల్పించింది.
వీరితో పాటు రాజీవ్ శుక్లా( చత్తీస్గడ్), మాజీ ఎంపీ పప్పూ యాదవ్ సతీమణి రంజిత్ రంజన్( బీహార్), అజయ్ మకెన్( హర్యానా), ఇమ్రాన్ ప్రతాప్ గర్హి( మహారాష్ట్ర) లను బరిలోకి దింపింది. ఇందులో చిదంబరం, జైరాం రమేష్, వివేక్ టంకాలు మాత్రమే వారి సొంత రాష్ట్రాల నుంచి పోటీ చేస్తున్నారు. మరో సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ కు అవకాశం ఇస్తారని ప్రచారం జరిగినప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు.