కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడోయాత్ర బుధవారం మధ్యప్రదేశ్ లోకి ప్రవేశించింది. రెండు రోజుల విరామం తర్వాత బుర్ఖాన్పూర్ నుంచి భారత జోడో యాత్ర కొనసాగుతోంది. మహారాష్ట్ర సరిహద్దులో మధ్యప్రదేశ్లోకి ప్రవేశించే ముందు బుడేర్లి దగ్గర కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీకి త్రివర్ణ పతాకాన్ని అందించి ఘన స్వాగతం పలికారు. ఈ యాత్రలో నేడు కమలనాథ్ సహా పలువురు అగ్రనేతలు, కాంగ్రెస్ కార్యకర్తలు రాహుల్ వెంట నడుస్తున్నారు.
కాగా రాహుల్ పాదయాత్ర నేటితో 77 రోజులకు చేరింది. మధ్యప్రదేశ్లో రాహుల్ పాదయాత్ర ఏడు జిల్లాలలో 12 రోజులపాటు కొనసాగనుంది. ఆ తరువాత రాజస్థాన్ లోకి భారత్ జోడో యాత్ర ప్రవేశిస్తుంది. అయితే ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. బిజెపి యువత, రైతులు కార్మికుల మనసులో భయాన్ని వ్యాప్తి చేసిందని మండిపడ్డారు. హింసను ప్రేరేపిస్తూన్నారని మండిపడ్డారు. దేశంలోని పరిశ్రమలను, విమానాశ్రయాలను, ఓడరేవులను కేవలం నలుగురు పారిశ్రామికవేత్తల చేతుల్లో ఉన్నాయని ఆరోపించారు.