కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు.. అందుకే దుబ్బాకకు రావట్లేదు !

-

తెలంగాణ లో బీజేపీ – కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. అందుకే దుబ్బాక లో కాంగ్రెస్ అడుగు పెట్టడం లేదనన్ ఆయన వ్యవసాయ బిల్లును తెచ్చిన మోడీని వదలి సీఎం కేసీఆర్ ను కాంగ్రెస్ నేతలు‌ తిట్టడమే ఇందుకు నిదర్శనమని అన్నారు. కాంగ్రెస్ – కమలం ఒక్కటేనన్న ఆయన కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ ఢిల్లీలో బీజేపీ పై పోరాటం చేయమంటే తెలంగాణలోని కాంగ్రెస్ గల్లీ లీడర్లు సీఎం కేసీఆర్ పై విమర్శలు చేస్తున్నారని అన్నారు.

ఇక కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి మాణిక్ ఠాగూర్ జర తెలంగాణసే సీకో, దేశంలో ఐదు రాష్ట్రాలలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని, రాజస్థాన్, పంజాబ్, మహారాష్ట్ర, పాండిచ్చేరి, ఛత్తీస్ ఘర్ రాష్ట్రాలలో.. ఏదైనా రాష్ట్రంలో 24 గంటలు ఉచితంగా కరెంటు ఇస్తున్నారా..? అని ప్రశ్నించారు. ఏదైనా రాష్ట్రంలో ఎకరానికి 10 వేల పెట్టుబడి సాయం అందిస్తున్నారా ? అని ప్రశ్నించిన ఆయన వెళ్లి చూసొద్దామని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు అయ్యిందని, ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ బీజేపీ పై పోరాటం చేస్తే.. తెలంగాణ రాష్ట్రంలో రహస్య-చీకటి ఒప్పందం చేసుకుందని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తిట్టినా దీవెనలుగా భావిస్తామని ఆయన అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version