ప్రస్తుత తరుణంలో మనకు అనేక పనులకు ఆధార్ కార్డు అవసరం అవుతోంది. డిజిటల్ రూపంలో ఆధార్ కార్డు ఉన్నప్పటికీ కేవలం కొన్ని చోట్ల మాత్రమే దాన్ని తీసుకుంటున్నారు. అనేక చోట్ల భౌతిక రూపంలో ఉన్ కార్డు మనకు అవసరం పడుతోంది. అయితే కొందరికి ఫిజికల్ ఆధార్ కార్డు ఉండదు. అలాంటి వారు కార్డును ఫిజికల్ రూపంలో ఎలా పొందాలా ? అని ఆలోచిస్తుంటారు. అలాంటి వారు కింద తెలిపిన సింపుల్ మెథడ్ పాటించి ఫిజికల్ రూపంలో ఆధార్ కార్డును వెంటనే పొందవచ్చు. అందుకు ఏం చేయాలంటే..
* క్రెడిట్ కార్డు సైజులో ఉండే పీవీసీ ఆధార్ కార్డును ఎవరైనా పొందవచ్చు. అందుకు ముందుగా https://uidai.gov.in అనే సైట్‌లోకి వెళ్లాలి.
* ఆ సైట్‌లో ఉండే గెట్ ఆధార్ అనే చోట order pvc reprint అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. దానిపై క్లిక్ చేసి అందులో వివరాలు నమోదు చేయాలి.
* అనంతరం క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి.
* ఆధార్‌తో లింక్ అయి ఉన్న మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయాలి. దానికి ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేయాలి.
* తరువాత పేమెంట్ పేజీ దర్శనమిస్తుంది. అక్కడ రూ.50 చెల్లించాలి.
* అనంతరం ఎస్ఆర్ఎన్ నంబర్ వస్తుంది. దాన్ని భద్రపరుచుకోవాలి.
* తరువాత 10 రోజుల్లోగా పీవీసీ ఆధార్ కార్డు ఇంటికి వస్తుంది.
దాన్ని ఫిజికల్ రూపంలో ఉపయోగించుకోవచ్చు.