గత ఏడు నెలలుగా ఆగిపోయిన `ఆర్ ఆర్ ఆర్` షూటింగ్ ఈ నెల 20 నుంచి ప్రారంభం కాబోతోంది. ఇందు కోసం టీమ్ అంతా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ మూవీ షూటింగ్ కోసం దేశంలోని వివిధ ప్రాంతాలు, సిటీల నుంచి వచ్చే టెక్నిషియన్స్‌తో పాటు హీరోలు, డైరెక్షన్ టీమ్ మొత్తం యూనిట్ అంతా క్వారెంటైన్‌కి వెళుతున్నారు.
రెండు వారాల పాటు క్వారెంటైన్‌కే టీమ్ మొత్తం పరిమితం కాబోతోంది. ఈ నెల 5న అంటే సోమవారం నుంచి హైదరాబాద్‌లో ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. ఇందు కోసం ఇప్పటికే మాదాపూర్‌తో సహా బంజారాహిల్స్‌లోని పార్క్ హయత్ హోటల్‌తో సూట్లని బుక్ చేశారు. ఇందులో టీమ్ మెంబర్స్ హోమ్ ఐసోలేషన్‌లో వుంటారట. షూట్ రెండు వారాలు వుంటుంది కాబట్టి ఆ రెండు వారాల పాటు హోటల్లో వుంటూ షూట్లో పాల్గొంటారని తెలుస్తోంది.
అనుకున్న సమయానికి షూట్‌ని పూర్తి చేయాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ షెడ్యూల్ రాజమౌళికి కత్తిమీద సామే అంటున్నారు. ఏ ఒక్కరికి కరోనా సోకినా టీమ్ మొత్తం క్వారెంటైన్‌కి వెళ్లాల్సి వుంటుంది. అంతే కాకుండా అనుకున్న సమయానికి షూట్ పూర్తి కాదు. మధ్యలో ఆపేయాల్సి వస్తుంది. ఈ భయాలు ఇప్పడు రాజమౌళిని వేధిస్తున్నాయట.