అవినీతికి మద్దతుగా కాంగ్రెస్ ఆందోళనలకు పిలుపునిచ్చింది: స్మృతి ఇరానీ

-

అవినీతికి మద్దతుగా కాంగ్రెస్ ఆందోళనలకు పిలుపునిచ్చిందని మండిపడ్డారు కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ. గాంధీ కుటుంబం అవినీతికి కాంగ్రెస్ శ్రేణులు మద్దతు తెలపడం విడ్డూరంగా ఉందన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థపై ఒత్తిడి చేయడానికి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల నుంచి ఢిల్లీకి అగ్రనేతలు వచ్చారని ఆరోపించారు. ఇంత మంది బహిరంగంగానే ఏజెన్సీ పై ఒత్తిడి తెస్తున్నారు అన్నారు. ఇదేనా కాంగ్రెస్ పార్టీ విధానం? జైలు నుంచి బెయిల్ పై విడుదలైన వ్యక్తి కేంద్ర దర్యాప్తు సంస్థల పై ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు.

1930లలో అసోసియేట్ జర్నల్ లిమిటెడ్ 5,000 మంది స్వాతంత్ర సమరయోధుల తో వాటాదార్లుగా ఏర్పడిందని, అయితే స్వాతంత్ర సమరయోధులు నడపాల్సిన సంస్థను  గాంధీ కుటుంబం లాక్కుందని మంత్రి ఆరోపించారు. AJL ఉద్దేశం వార్తా పత్రికలు ప్రచురించడం.. అయితే 2008లో కంపెనీ ఇకపై వార్తా పత్రికలు ప్రచురించదని ప్రకటించింది. కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి ప్రవేశించింది. ఇది కాంగ్రెస్ పార్టీకి బహిరంగంగా తెలుసు. రూ. 70 కోట్ల రుణాన్ని మాఫీ చేశారని ఆమె అన్నారు.

కాంగ్రెస్ కు డబ్బు విరాళంగా ఇచ్చిన దాతలను మంత్రి ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఆ డబ్బును ప్రజా ప్రయోజనాల కోసం, ప్రజాసేవ కోసం ఉపయోగించకుండా, గాంధీ కుటుంబానికి లాభం చేకూర్చడానికి ఉపయోగించిందని మీకు తెలుసా? అంటూ దాతలను ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version