టైటిల్ మారిన బాలయ్య బ్లాక్ బాస్టర్ సినిమా ఇదే..

-

నందమూరి కుటుంబాన్ని ప్రేక్షకులు ఎంతగా ఆదరిస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందులో ముఖ్యంగా నటసింహం నందమూరి బాలకృష్ణ సినిమా అంటే అభిమానులకు పండుగే. బాలయ్య-బి.గోపాల్ కాంబోలో వచ్చిన సినిమా ‘నరసింహ నాయుడు’ అప్పటికి ఉన్న రికార్డులన్నిటినీ తిరగరాసింది.

అయితే ఈ సినిమాకు మొదట ఈ టైటిల్ కాదండోయ్. ‘అయోధ్య రామయ్య’ అనే టైటిల్ తో రచయిత పోసాని కృష్ణ మురళి అందించిన స్టోరితో బి.గోపాల్ షూటింగ్ స్టార్ట్ చేశారు. అలా ఈ సినిమా స్టార్ట్ అయిన క్రమంలోనే బాలయ్య అభిమానుల నుంచి బి.గోపాల్ కు అభినందనలు వచ్చాయి. ఈ సినిమా డెఫినెట్ గా హిట్ కావాలని కోరారు. దాంతో దర్శకుడు ఆలోచనలో పడ్డాడు. అలా వెంటనే ప్రముఖ రచయిత చిన్ని కృష్ణకు ఫోన్ చేసి స్టోరి కావాలని అడగగా ఆయన తయారు చేసిన కథను డైరెక్టర్ కి వినిపించారు.

ఆ స్టోరి విన్న డైరెక్టర్ గోపాల్ ..కొన్ని కమర్షియల్ హంగులు జోడించి ‘నరసింహ నాయుడు’ సినిమా చేశారు. ఈ పిక్చర్ కు పరుచూరి బ్రదర్స్ మాటలు అందించారు. అలా ‘అయోధ్య రామయ్య’ సినిమా అక్కడే ఆగిపోయింది. అలా ఆ టైటిల్ పోయి ‘నరసింహ నాయుడు’ టైటిల్ తో సినిమా విడుదలై ఘన విజయం సాధించింది. ఈ సినిమా బాలకృష్ణ కెరీర్ లోనే ది బెస్ట్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. బాలయ్య అభిమానులకు ఈ సినిమా బాగా ఇష్టం.

Read more RELATED
Recommended to you

Exit mobile version