అనైతిక కలయికను తట్టుకోలేక మాజీ మంత్రి రాజీనామా..

-

తెదేపాతో కాంగ్రెస్ పార్టీ కలవడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి వట్టి వసంత్ కుమార్ పార్టీకి రాజీనామా చేశారు. సిద్ధంతాలను పక్కన పెట్టి తెదేపాతో ఎలా జతకడతారంటూ ఆయన అధిష్టానాన్ని ప్రశ్నించారు. ఈ మేరకు రాహుల్ గాంధీకి మొయిల్ ద్వారా తన రాజీనామా లేఖను పంపినట్లు తెలుస్తోంది. ఊసరవెల్లి లాంటి తెదేపా నాయకుడు చంద్రబాబు వలలో రాహుల్ గాంధీ పడటం చాలా దారుణమని ఆయన పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీని తెలుగువారి బద్ద శత్రువుగా అనేక సార్లు పేర్కొన్న చంద్రబాబు అదే పార్టీతో పొత్తుకు సై అనడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటని వసంత్ కుమార్ అడిగారు. రెండు దశాబ్దాలకు పైగా తెదేపా పై పోరాటం చేస్తున్న పార్టీ పరువుని నేడు మంటగలిపారని ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మరో రెండు మూడు రోజుల్లో తాను భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తానని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version