నేను కాపీ కొట్టలేదు.. నాదాంట్లో చూసే కాపీ కొట్టారు..!

-

కార్తియాని అమ్మ.. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఈమె పేరు మార్మోగిపోతున్నది. కేరళ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అక్షర లక్ష్యం కార్యక్రమంలో చేరి నూటికి 98 మార్కులు తెచ్చుకుంది. దీంతో ఆమె కేరళలోనే కాదు.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఒక బామ్మ ఏంది.. 96 ఏళ్ల వయసులో చదవడమేంది.. నూటికి 98 మార్కులు తెచ్చుకోవడమేందని ఆమెను తెగ పొగుడుతున్నారు.

అయితే.. సోషల్ మీడియాలో ఆమెపై నెగెటివ్ కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఆ ముసలావిడ కాపీ కొట్టి పాసయి ఉంటుందిలే.. లేకపోతే ఈ వయసులో ఇన్ని మార్కులు రావడమేంది.. విడ్డూరం కాకపోతే అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఆ కామెంట్లను లైట్ తీసుకోకుండా వాటిపై స్పందించింది ఈ బామ్మ.

నాయనల్లారా? నేను ఎవరి పేపర్లో చూసి కాపీ కొట్టలేదు. నాకు ఎవరూ సాయం చేయలేదు. పైపెచ్చుకు నాదాంట్లోనే చూసి మిగితావాళ్లు రాసుకున్నారు.. ఏం రాయాలో కూడా నేనే వాళ్లకు చెప్పాను.. అంటూ చెబుతోంది అమ్మ. అంతే కాదు.. తను ఇప్పుడు కంప్యూటర్‌ను కుస్తీ పడుతోందట. కంప్యూటర్‌తో కూడా ఓ ఆటాడుకుంటా చూడు అంటోంది. ఆమెను కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా సన్మానించారు.

నేను చిన్నప్పుడు చదువుకోలేదు గానీ.. చదువుకొని ఉంటేనా.. ప్రభుత్వ ఉద్యోగం చేసి ఉండేదాన్ని. నేటి యువత నన్ను చూసి ప్రేరణ పొందేవారు.. అంటూ చెప్పుకొచ్చింది బామ్మ. ఈ బామ్మ తన క్లాస్‌లోనే అందరి కంటే ఎక్కువ వయసు గల వ్యక్తి. అలా ఓరికార్డు.. ఎక్కువ మార్కులు తెచ్చుకొని మరో రికార్డు క్రియేట్ చేసింది. వామ్మో.. బామ్మా.. నువ్వు మామూలు దానివి కాదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version