రైతుల పాలిట కాంగ్రెస్ భస్మాసుర హస్తంగా మారింది : ఎంపీ లక్ష్మణ్

-

రైతుల పాలిట కాంగ్రెస్ భస్మాసుర హస్తంగా మారిందని బీజేపీ కీలక నేత, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ పేర్కొన్నారు. తాజాగా ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అసమర్థత పాలన కొనసాగుతోందని విమర్శించారు. సీఎం, మంత్రులు ఢిల్లీకి పరుగులు పెట్టడం తప్పా.. ప్రజలకు ఏమి చేయడం లేదన్నారు. ఢిల్లీ నాయకులకు గులాంలుగా మారారని మండిపడ్డారు.

రాష్ట్రంలో భారీ వర్షాలు పడి.. ప్రజలు పలు వ్యాధుల బారిన పడుతున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదన్నారు. ఇవాళ హైదరాబాద్ నగరంలో ఏ ఆసుపత్రి చూసినా రోగులతో కిటకిటలాడుతున్నాయని తెలిపారు. ప్రతిరోజు వార్తల్లో నిలవాలని హైడ్రా పేరుతో హడావుడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్యారెంటీల పేరిట అమలు కానీ హామీలు ఇచ్చి మోసం చేస్తున్నారని పేర్కొన్నారు. మరోవైపు రుణమాఫీ కాక.. రైతు భరోసా అందక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అవినీతి, అక్రమాలకు పెట్టింది పేరు కాంగ్రెస్ అన్నారు ఎంపీ డా.కే. లక్ష్మణ్.

Read more RELATED
Recommended to you

Exit mobile version