అన్నింటి కంటే బెస్ట్ అయిన ఎలిఫెంట్ పేరెంటింగ్ గురించి మీకు తెలుసా..? ఇలా ఫాలో అవ్వాలి..!

-

What is elephant parenting?

పిల్లల విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లల విషయంలో తల్లిదండ్రులు అసలు తప్పులు చేయకూడదు. పిల్లలకి ర్యాంకులు రావాలి. మార్కులు రావాలి అని ఫోర్స్ చేయడం కాదు. మానసిక పరిస్థితిని అర్థం చేసుకోవాలి. మీ పిల్లలు బాగా ఉన్నత స్థాయికి వెళ్లాలన్నా, ఆరోగ్యంగా, హ్యాపీగా ఉండాలన్నా ఎలిఫెంట్ పేరెంటింగ్ చాలా బెస్ట్. అది ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఎలిఫెంట్ పేరెంట్స్ అంటే ఏంటి..?

పిల్లల పెంపకంలో ఒక్కొక్కరిది ఒక్కో పద్ధతి ఉంటుంది. కొంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని చాలా గారాబం చేస్తూ ఉంటారు. కొంతమంది చదువులో ముందుండాలని ఫోర్స్ చేస్తూ ఉంటారు. తల్లిదండ్రులు పిల్లల్ని అర్థం చేసుకోవాలి. ఏ బాధ వచ్చినా కూడా తల్లిదండ్రులే వారికి తోడుగా ఉండాలి. పిల్లలు నలుగురిలో కలిసిపోయేటట్టు చూడడం చాలా అవసరం. పిల్లలు ఎవరితోనైనా కలుస్తేనే అనుబంధాలు, ఆప్యాయతలు పెరుగుతాయి. అలాంటి కలుపుకోలుతనం వలన స్నేహాలు ఏర్పడతాయి. అలాంటి వాళ్ళలో సామాజిక నైపుణ్యాలు అలవాటు అవుతాయి. ఏనుగు పిల్ల తన తల్లిదండ్రులతోనే కాదు ఇతరులు ఏనుగులతో ప్రేమగా ముద్దు ముద్దుగా ఉంటుంది. కారణం తల్లి ఏనుగు అని నిపుణులు చెప్తున్నారు. తల్లి ఏనుగు తన పిల్లల్ని చిన్నప్పటి నుంచి ఇతర ఏనుగులతో కలిసిపోయేలా ప్రోత్సహిస్తుంది.

పెద్దవాళ్లు చాలా అవసరం:

తల్లి ఏనుగు తన కుటుంబంలోని ఏనుగులు అన్నింటితో తన పిల్ల ఏనుగుల్ని గడిపేటట్టు చేస్తుంది. అంటే మన పిల్లలు నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు వారితో సమయాన్ని గడిపేటట్టు చూసుకోవాలి.

పరిశీలన నేర్పించండి:

పిల్లలు సహజంగా జిజ్ఞాసను కలిగి ఉంటారు. కొత్త వాటిపై ఆకర్షితులు అవుతారు. తల్లిదండ్రులు దాన్ని తుంచే ప్రయత్నాలు ఎక్కువ చేస్తుంటారు. అది తప్పు. పిల్ల ఏనుగులు తల్లి నుంచే కాకుండా ఇతర జంతువుల నుంచి చాలా విషయాలు నేర్చుకుంటాయి. గంటలు తరబడి ఫోన్స్ లో మునిగిపోకుండా పుస్తకాలు చదివించడం ఇతర వాటిని పిల్లలకు తల్లిదండ్రులే అలవాటు చేయాలి.

అతి అనర్థం:

ఎలిఫెంట్ పేరెంటింగ్ అన్నాం కదా అని పిల్లలు వెంట ఉండడం కాదు. ఏదైనా అతి అనర్థమే గారాబం. వారు స్వేచ్ఛను హరించడం అదుపులో పెట్టడానికి చూడడం ప్రోత్సహించకుండా ఉండడం ఇవన్నీ తప్పు.

Read more RELATED
Recommended to you

Exit mobile version