భారతదేశాన్ని కాంగ్రెస్ నాశనం చేసిందని మండిపడ్డారు ప్రధాని నరేంద్ర మోడీ. దేశ ప్రజలు కాంగ్రెస్ ని నిరాకరిస్తున్నారని తెలిపారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు చెప్పే తీర్మానంపై రాజ్యసభలో ప్రసంగిస్తున్నారు ప్రధాని మోదీ. ఈ సందర్భంగా మోడీ ప్రసంగాన్ని ప్రతిపక్షాలు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అదాని అంటూ విపక్ష సభ్యులు హోరెత్తించారు. మోడీ మాత్రం తన ప్రభుత్వం చేపట్టిన పథకాలు, ప్రాజెక్టులు, నిర్ణయాలు వంటివి మాత్రం తనదైన శైలిలో చెప్పుకుంటూ పోతున్నారు.
కర్ణాటకలో కోటి 70 లక్షల జన్ ధన్ ఖాతాలు ఉండేవని, ఇప్పుడు అవన్నీ మూతపడ్డాయని అన్నారు. జనం డబ్బు మధ్యవర్తుల చేతుల్లోకి వెళ్లిందన్నారు ప్రధాని మోదీ. గరీబ్ హటావో అనేది కాంగ్రెస్ పార్టీకి ఓ నినాదం మాత్రమేనని.. తాము మాత్రం దేశ ప్రజల కోసం రాత్రి పగలు కష్టపడతామని తెలిపారు. ఇతర దేశాలు అభివృద్ధి చెందితే, కాంగ్రెస్ మాత్రం భారతదేశాన్ని నాశనం చేసిందన్నారు. యూపీఏ ఏ సమస్యకు శాశ్వత పరిష్కారం పై ఆలోచన చేయలేదన్నారు. తాము మాత్రం దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం చూపుతున్నామని తెలిపారు. ఆరు దశాబ్దాల కాంగ్రెస్ పాలన అంతా శుద్ధ దండగేనని అన్నారు.