హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో గల కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూముల వేలంపై పెద్దఎత్తున వివాదం నెలకొన్నది. ఆ భూములను అమ్మొద్దని వర్సిటీ పెద్దలు, విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. మరోవైపు ప్రతిపక్ష బీజేపీ, బీఆర్ఎస్ నేతలు సైతం వర్సిటీ భూములను అమ్మొద్దని ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
అయితే, అక్కడ ఆందోళనలు చేస్తున్న వారంతా పెయిడ్ ఆర్టిస్టులు, గుంటనక్కలు అని కాంగ్రెస్ పార్టీ ఆరోపించడంపై విద్యార్థులు, అధ్యాపకులు సీరియస్ అవుతున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ‘ఒకప్పుడు ఇదే యూనివర్సిటీ విద్యార్థులు కదా భట్టి గారు, శ్రీధర్ బాబు గారు. ఇప్పుడు విద్యార్థులు చేస్తున్న ఈ పోరాటాన్ని పెయిడ్ స్టంట్ అనడానికి మీకు మనసేలా వచ్చింది?.
మీకో విషయం తెలియదు సార్ కాంగ్రెస్ అంటేనే తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే రకం’ అని అధ్యాపకులు విమర్శించారు.