రాహుల్ గాంధీతో ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక భేటీ.

-

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే జగ్గారెడ్డి రాహుల్ గాంధీతో సమావేశం అయ్యారు. ఆయనతో పాటు కుటుంబ సభ్యులు కూడా రాహుల్ గాంధీని కలవనున్నారు. గత కొంత కాలంగా పీసీసీ అధ్యక్షడు రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పిస్తున్నారు జగ్గారెడ్డి. పార్టీలో జరుగుతన్న వ్యవహారాలను గతంలో రాహుల్ గాంధీ దృష్టి తీసుకెళ్తానని.. అందుకు నాకు అపాయింట్మెంట్ ఇప్పించాని పార్టీ పెద్దలను జగ్గారెడ్డి కోరారు. తాజాగా ఈరోజు జగ్గారెడ్డి రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ఫ్రచారం గురించి అధినేత రాహుల్ గాంధీకి వివరించనున్నారు.

పార్టీలో జరుగుతున్న పరిణామాలను రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లనున్నారు జగ్గారెడ్డి. పార్టీలో వ్యక్తి భజన ఎక్కువగా పెరిగిందంటూ జగ్గారెడ్డి అనేక సార్లు విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి అనుచరులు తనపై కావాలనే బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారంటూ… విమర్శలు చేశారు. తాను కాంగ్రెస్ కు రాజీనామా చేస్తానని గతంలో ప్రకటించి విరమించుకున్నారు జగ్గారెడ్డి. ఈ పరిణాలన్నింటి గురించి రాహుల్ గాంధీతో చర్చించనున్నారు జగ్గారెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version