ప్రేమ ఉంది కనుక ప్రవరుని స్వగతం అనే
పాఠం మా పదో తరగతి వాచకంలోకి వచ్చింది
కనుక అక్కడ కూడా మగాడు గొప్పవాడే !
వాడే కనుక లేకుంటే అంతటి విఖ్యాతి
ఆ కావ్యానికి ఉండేది కాదని
నేననుకుంటాను.
కావ్యానికీ కావ్యకన్యకకూ ఆధారం మగాడే !
అప్పుడూ ఇప్పుడూ మగాడు అనే మూడక్షరాలే
ప్రపంచంలో ప్రేమ స్థిరతకు కారణం..సందిగ్ధతకూ ఆనవాలు
నవ్యతకు సోపానం కూడా అతడే! ఎనీ డౌట్స్ !
అబద్ధాలు చెప్పడంలో అమ్మాయిలు ముందుంటారు కానీ అబ్బాయిలే ముందుంటారు అని,ఆ విషయంలో వారే ముదుర్లు అని అభాండాలు వేస్తారు. ఆడ పిల్లలు కూడా కొన్ని సార్లు ముదుర్లు అని చెప్పానా కానీ వినలేదు కొందరు. ఈసారి మాత్రం తప్పక నిరూపిస్తాను. అబ్బాయిలు కొందరు అనగా నాలాంటి వారు అమాయకులు అని చెప్పేందుకు ఎన్నో ఉదాహరణలు ఎన్నో రోజులుగా వెన్నంటే ఉన్నాయి నాలో మరియు నాతో! కానీ అవి ఎక్స్ ప్రెస్ కావడం లేదు. సరిగ్గా ఫోకస్ లోకి రాక చాలా కాలం అవి అలానే నా వెనుక దాగి ఉంటున్నాయి. నా నీడల్లో నీడ మాదిరి ఉంటున్నాయి.
మెన్ విల్ బి మెన్.. మెనీ ఆఫ్ ద విమెన్ వాంట్స్ టు అబ్జెక్ట్ దిస్.. అబ్జెక్షన్ అయితే పర్లేదు కానీ చాలా విషయాలు అబ్జెక్టిఫై అయి ఉంటాయి. ఉన్నాయి కూడా ! ఆ విధంగా హేమమాలిని ఆ విధంగా శ్రీదేవి (మన మధ్య లేకున్నా హృదయంలో ఉన్నారులే), ఇంకా ఇంకొందరు. పార్లమెంట్ ఏమయినా ప్రేమికుల కోసం నిర్మించిన భవంతినా అని అనుకోవద్దు. ఎక్కడయినా ప్రేమ ఉండవచ్చు. వద్దు అని అనేందుకు దేశ ప్రధాని అయిన నరేంద్ర మోడీకి కూడా హక్కు లేదు. ఆ విధంగా ప్రేమ పూర్వక మాటలు లేదా సంబంధించి వచనం వినిపిస్తేనే రాష్ట్రాలు సఖ్యతగా ఉంటాయి.
దేశ సమగ్రతకు అస్సలు భంగం వాటిల్లదు. ఆ విధంగా మంచికి చోటు,చెడుకు వేటు దొరుకుతుంది మరియు దక్కుతుంది కూడా! ఇప్పుడు చెప్పండి పార్లమెంట్ ప్రాంగణాన ప్రేమ లేదా? అక్కడి వనాల్లో నవ్వుల్లో అక్కడక్కడ తిరిగే అందమయిన అమ్మాయిల్లో ఇంకా జర్నలిస్టులలో కూడా ప్రేమ ఉంది. అదే ప్రేమకు కొంత కొనసాగింపు లేదా సాగు పద్ధతి మన శశిధరూర్ ఎందుకు కాకూడదు. పోనీ ఆయన చెబుతున్న మాటలు చెవులు రిక్కించి వింటున్న సుప్రియా సూలే ఎందుకు కాకూడదు? అన్నవి నా తరఫు ప్రశ్నలు. మెన్ విల్ బి మెన్ అని చెప్పడం తప్పు కాదు అదొక గౌరవం..గౌరవ వాచకం కూడా!
– రత్నకిశోర్ శంభుమహంతి
ఫొటో : నరేంద్ర.జి.