కేటీఆర్ ఫొటో ఎందుకు పెట్టలేదని అడిగినందుకు.. కాంగ్రెస్ నేతల దాడి

-

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సొంత నియోజకవర్గం సిరిసిల్లలో బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ నేతలు దాడికి పాల్పడ్డారు. ప్రోటోకాల్ ప్రకారం స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ ఫొటో ఎందుకు పెట్టలేదని అడిగినందుకు బీఆర్ఎస్ నాయకులపై దాడి జరిగినట్లు సమాచారం.

గురువారం సిరిసిల్ల నియోజకరవర్గం గంభీరావుపేటలో వడ్ల కొనుగోలు కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే ఫొటోను అధికారులు పెట్టలేదు. దీంతో కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవం వద్ద అధికారులను బీఆర్ఎస్ నాయకులు నిలదీసినట్లు తెలిసింది. దీంతో అక్కడే ఉన్న అధికార పార్టీ నాయకులు మూకుమ్మడిగా దాడికి దిగినట్లు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని ఇరువర్గాలను శాంతింపజేసినట్లు తెలిసింది.

Read more RELATED
Recommended to you

Latest news