ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మీద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.ఈడీని తెచ్చిందే కాంగ్రెస్ అని మండిపడ్డారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ అధికారులు.. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీల పేర్లను చార్జిషీట్‌లో చేర్చడంపై నేషనల్ మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన బదులిచ్చారు.
దేశంలో ఈడీని కాంగ్రెస్ తెచ్చిందని, అది సరైనదా? కాదా? అని కాంగ్రెసే నిర్ణయించుకోవాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు గతంలో CBI, ఇతర సంస్థలను దుర్వినియోగం చేశారు. ఇప్పుడు ఈడీని దుర్వినియోగం చేయడం బీజేపీ వంతుగా మారిందని అన్నారు. రాహుల్ గాంధీ తమ CWC సమావేశంలో తాము అధికారంలోకి వస్తే ఈడీని తుడిచి పెడతామని ఒక తీర్మానాన్ని ఆమోదించాలని.. ఈడీ దుర్వినియోగం అవుతుందని వారు నిజంగా భావిస్తే, వారు దేశ ప్రజలకు అలాంటి తీర్మానాం చేసి హామీ ఇవ్వాలని ఈ సందర్భంగా కేటీఆర్ సూచించారు.