కాంగ్రెస్‌ త్వరలో రాహుల్‌, ప్రియాంక వర్గంగా చీలిపోవచ్చను : ఆచార్య ప్రమోద్‌ కృష్ణం

-

కాంగ్రెస్‌ పార్టీ త్వరలో రాహుల్‌గాంధీ వర్గంగా, ప్రియాంకగాంధీ వర్గంగా చీలిపోవచ్చని కాంగ్రెస్‌ మాజీ నేత ఆచార్య ప్రమోద్‌ కృష్ణం సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.శనివారం ప్రముఖ మీడియాతో మాట్లాడుతూ… రాహుల్ గాంధీ అమేథీని వీడటంతో పార్టీ కార్యకర్తల మనోధైర్యం తగ్గిపోయిందని తెలిపారు. రాహుల్‌కు పాక్‌లో ఆదరణ ఉన్నందున రాయ్‌బరేలీకి బదులుగా రావల్పిండి నుండి పోటీ చేయాలని భావిస్తున్నట్లు ఆచార్య ప్రమోద్‌ అన్నారు.

 

ప్రియాంక గాంధీ లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తారని అందరూ అనుకున్నారు, కానీ ఆమె పోటీ చేయకపోవడంతో ఆమె మద్దతుదారుల గుండెల్లో అగ్నిపర్వతం రగులుతుంది. అది జూన్ 4 తరువాత పేలుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రియాంకపై పెద్ద కుట్ర జరుగుతోందని అన్నారు. ఆమె కుటుంబం, పార్టీ పన్నిన కుట్రకు ఆమె బాధితురాలు అని గతంలో అన్న మాటాలను ఆచార్య ప్రమోద్‌ గుర్తు చేశారు .రాహుల్ అమేథీలో పోటీ చేయరని నేను ముందే చెప్పాను. ఈ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ వాద్రాను రాహుల్ గాంధీ పోటీ చేయనివ్వరని కూడా చెప్పాను అని అన్నారు. ఆమెపై కుట్ర జరుగుతుందని ,రాహుల్ గాంధీ అమేథీ నుంచి పోటీ చేయకూడదనుకుంటే ప్రధాని నరేంద్ర మోడీపై వారణాసి నుంచి పోటీ చేసి ఉండాల్సిందని అన్నారు. అయితే క్రమశిక్షణా చర్యల క్రింద ఆచార్య ప్రమోద్ కృష్ణంను ఫిబ్రవరి నెలలో కాంగ్రెస్‌ పార్టీ నుంచి బహిష్కరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version