దేవుని భూమి కబ్జా చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి..!

-

సాధారణంగా కొందరూ భూములు కబ్జా చేసే విషయాన్ని మనం చూస్తూనే ఉంటాం. ఎక్కువగా పేదల భూములను కబ్జా చేస్తుంటారు. కానీ ఇక్కడ ఓ కబ్జాదారుడు ఏకంగా దేవుని భూమినే కబ్జా చేసాడు. ఈ ఘటన నిజామాబాద్ రూరల్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి నిజామాబాద్ నూతన కలెక్టరేట్ సమీపంలోని గుడి భూమిని కబ్జా చేసాడు.

కాంగ్రెస్ లీడర్లు తాము గుడి కోసం ఇచ్చిన భూమిని కబ్జా చేశారని ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు దాతలు. ఆంబులెన్స్‌లో వచ్చి ఫిర్యాదు చేసింది వృద్దురాలు మణెమ్మ.  కలెక్టర్ న్యాయం చేయాలని డిమాండ్ చేసింది.  నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి అనుచరులు, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత భర్త ఆకుల రాఘవేందర్, మాజీ నిజామాబాద్ జిల్లా ఒలంపిక్ అధ్యక్షుడు గడిల రాములు బరితెగించి భూకబ్జాలు చేస్తున్నారని ఆరోపణలు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version