మోహన్ బాబు కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. మరోసారి మోహన్ బాబు…అజ్ఞాతంలోకి వెళ్లారు. మోహన్ బాబు కు ఇచ్చిన హై కోర్టు గడువు పూర్తి అయింది. కానీ ఇప్పటి వరకు పోలీసుల విచారణకు అందుబాటులోకి రాలేదు మోహన్ బాబు.
ఇక ఈ తరుణంలోనే… మోహన్ బాబు కు నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. మోహన్ బాబు ఎక్కడ ఉన్నాడో తెలుసుకుంటున్నారు పహాడి షరీఫ్ పోలీసులు. కాగా, ప్రస్తుతం టాలీవుడ్ నుంచి అల్లు అర్జున్ వార్తలో ఉంటున్నాడు కానీ.. కానీ బన్నీకి ముందు మంచు ఫ్యామిలీలో జరిగిన రగడ పెద్ద హాట్ టాపిక్ అయ్యింది అనే చెప్పాలి. మంచు ఫ్యామిలీలో జరిగిన గొడవ.. మనోజ్ పోలీస్ స్టేషన్ కు వెళ్లడం.. తర్వాత మోహన్ బాబు కేసు పెట్టడం.. ఆ తర్వాత మీడియా ప్రతినిధుల పైన ఆయన దాడి చెయ్యడం వంటి ఘటనలి జరిగాయి. దాంతో మోహన్ బాబు పైనే కేసు నమోదయ్యింది.