సర్వేల ఆధారంగానే హంగ్ వస్తుందని చెప్పా.. ఎంపీ కోమటిరెడ్డి క్లారిటీ

-

తెలంగాణ లో హంగ్ అసెంబ్లీ వస్తుందని తాను చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ కోమటరెడ్డి వెంకట్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. సర్వేల అధారంగానే హంగ్ వస్తుందని చెప్పానని.. తానేం గందగోళానికి గురి కాలేదని స్పష్టం చేశారు. మరోవైపు పొత్తుల గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన వెంకట్ రెడ్డి.. దానిపైనా మాట్లాడారు.

వరంగల్ సభలో రాహుల్​గాంధీ చెప్పినట్లుగానే ఏ పార్టీతో తమకు పొత్తు ఉండదని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి స్పష్టం చేశారు. రాహుల్​గాంధీ మాటలకే తాము కట్టుబడి ఉన్నట్లు వెల్లడించారు. దిల్లీ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి శంషాబాద్ విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు.

తానేమి తప్పుగా మాట్లాడలేదని, తనపై చిన్నపిల్లలు కూడా విమర్శలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. హంగ్ ఏర్పడినప్పుడు సెక్యులర్ భావాలున్న పార్టీల మధ్య పొత్తు ఉంటుందని చెప్పినట్లు పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌తో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి పొత్తు ఉండదని రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్​రావు ఠాక్రే స్పష్టం చేశారు. కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని కొట్టిపారేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version