Telangana : ద్రవ్య వినిమయ బిల్లుకు గవర్నర్ ఆమోదం

-

ఎన్నో నెలలుగా పెండింగ్ లో ఉన్న బిల్లుకు ఎట్టకేలకు మోక్షం లభించింది. ద్రవ్యవినిమయ బిల్లుకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదముద్ర వేశారు. ఈ నెల మూడో తేదీ నుంచి 12వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. అసెంబ్లీలో చివరి రోజు ద్రవ్యవినిమయ బిల్లుపై చర్చ చేశారు. 2023 – 24 ఆర్థిక సంవత్సరం బడ్జెట్​కు సంబంధించిన రెండు బిల్లులను గవర్నర్ ఆమోదించారు. గవర్నర్ ఆమోదంతో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రెండు బిల్లులు చట్టరూపం దాల్చాయి.

రెండు చట్టాలను గెజిట్ నోటిఫికేషన్​లో ప్రచురించేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర వార్షిక ప్రణాళికకు సంబంధించిన ద్రవ్యవినిమయ బిల్లులను శాసనసభ ఈ నెల 12వ తేదీన ఆమోదించింది. వాటిని మంగళవారం రోజున రాజ్ భవన్​కు పంపారు. గవర్నర్ తమిళిసై ఆమోదముద్ర వేయడంతో ద్రవ్యవినిమయ బిల్లులు చట్టరూపం దాల్చాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version