ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తోంది కాంగ్రెస్, అందులో భాగంగానే అన్ని కాంగ్రెస్ కమిటీలు రద్దు చేసి కొత్త కమిటీలను ప్రకటించారు. ఆరుగురు సభ్యులతో “ప్రత్యేక కమిటీ” ని వేసిన కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్యురాలు సోనియాగాంధీ. ఈ ప్రత్యేక కమిటీ పార్టీ సంస్థాగత వ్యవహరాలలోనూ, కార్యనిర్వహణలోనూ పార్టీ అధినేత్రి కి సహాయసహకారాలు అందించనున్నట్టు చెబుతున్నారు. ఆగస్టు 24 వ తేదీన సి.డబ్ల్యు.సి సమావేశంలో సోనియా గాంధీ వ్యక్తం చేసిన అభిప్రాయం ప్రకారం ఈ ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది.
ఈ కమిటీలో సీనియర్ నేతలైన ఏ.కే.ఆంటోని, అహ్మద్ పటేల్, కే. సి. వేణుగోపాల్,
అంబికా సోనీ, ముకుల్ వాస్నిక్, లతో పాటు రణదీప్ సింగ్ సూర్జేవాలకు చోటు దక్కింది. ఇది కాక సీనియర్ నేత మధుసూధన్ మిస్త్రి నేతృత్వంలో 5 గురు సభ్యులతో కూడిన కాంగ్రెస్ పార్టీ “ కేంద్ర ఎన్నికల సంఘం” ఏర్పాటు చేసారు. అంతే కాక కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ పునర్వ్యవస్థీకరణ కూడా చేపట్టారు. తొమ్మిది మంది ప్రత్యేక ఆహ్వనితులు, 26 మంది శాశ్వత ఆహానితులు తో పాటు 22 మంది సభ్యులతో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ 9 మంది ప్రత్యేక ఆహ్వానితుల జాబితా లో చింతా మోహన్, జి. సంజీవ్ రెడ్డిలకు చోటు లభించగా, దిగ్విజయ్ సింగ్, జైరామ్ రమేశ్ లకు శాశ్వత ఆహానితుల జాబితాలో చోటు లభించింది.