కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఏం మాట్లాడారో మాకు సమాచారం ఉందని.. మాజీ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. తాజాగా వైసీపీ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నాడు తిరుమల దర్శనానికి వచ్చినప్పుడు అమిత్ షా పై రాళ్ల వర్షం కురిపించారు. రాష్ట్రంలో ఎన్నో సమస్యలున్నాయి. విభజన సమస్యలు ఇంకా అపరిష్కృతంగానే ఉన్నాయి. ఇలాంటి సమయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సమస్యల గురించి మాట్లాడకుండా విందులు ఏంటో.. సమస్యలు అన్నీ పక్కన పెట్టి జగన్ ప్యాలెస్ ల గురించి మాట్లాడుతున్నారు.
లోకేష్ ను డిప్యూటీ సీఎం చేస్తానని చంద్రబాబు అమిత్ షాను అడిగారట.. లోకేష్ అన్ని శాఖల్లో వేలు పెడుతున్నారని.. ఆయనను ముందు అదుపులో పెట్టుకోవాలని చంద్రబాబును హెచ్చరించారు అమిత్ షా. లోకేష్ వసూళ్ల కార్యక్రమంలో నిమగ్నమైనందున స్పీడ్ తగ్గించుకోవాలని అమిత్ షా సూచించారు. అమిత్ షా సలహాలు బయటికీ రాకుండా కథలు వండి వారుస్తున్నారు. గత్యంతరం లేకనే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ను డిప్యూటీ సీఎం చేసారు.