హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా బల్మురి వెంకట్

-

హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నిక రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ నియోజకవర్గ ఉప ఎన్నికల షెడ్యూల్ ఖరారు కాగా.. అన్ని పార్టీలు ప్రచారంపై ఫోకస్ చేశాయి. ఇక అటు అధికార పార్టీ టిఆర్ఎస్ మరియు జనతా పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించే సి ప్రచారంలో దూసుకుపోతున్నాయి. అయితే హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి అంశంపై… మొదటి నుంచి సందిగ్దత నెలకొంది సంగతి తెలిసిందే.

హుజరాబాద్ నియోజకవర్గం షెడ్యూల్ విడుదల అయినప్పటికీ కూడా… అభ్యర్థిని ప్రకటించడంలో నానా తంటాలు పడుతోంది కాంగ్రెస్ పార్టీ. మొదట్లో పొన్నం ప్రభాకర్ పోటీ చేస్తారని ప్రచారం సాగగా… ఆ తర్వాత కొండా సురేఖ పేరు తెరపైకి వచ్చింది. అయితే హుజరాబాద్ నియోజకవర్గంలో పోటీ చేసేందుకు కొండా సురేఖ నో చెప్పినట్లు సమాచారం అందుతోంది.

దీంతో కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణ ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మురి వెంకట్ ను హుజూరాబాద్ అభ్యర్థి గా ఫైనల్ చేసింది. ఈ మేరకు కాసేపటి క్రితమే అధికారిక ప్రకటన చేసింది కాంగ్రెస్ పార్టీ. పెద్దపల్లి జిల్లా కు చెందిన బల్మురి వెంకట్ ను హుజూరాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో అభ్యర్థిగా బరిలో దించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. కాగా హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నిక అక్టోబర్ 30 న జరుగనున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version