తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ : వేముల వీరేశం

-

తెలంగాణ బడ్జెట్ సెషన్స్ చాలా హాట్ హాట్‌గా కొనసాగుతున్నాయి. నిన్న గవర్నర్ బడ్జెట్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై నేడు సభ జరుగుతుండగా.. ప్రతిపక్ష బీఆర్ఎస్ అధికార పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించింది. గవర్నర్ చేత అబద్ధాలు చెప్పించారని మండిపడింది.

తాజాగా ఎమ్మెల్యే వేముల వీరేశం అసెంబ్లీలో మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమాన్ని సజీవంగా నిలబెట్టింది, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. ఉద్యమాన్ని విజయతీరాలకు చేర్చింది కూడా కాంగ్రెస్ పార్టీనే అని చెప్పారు. ఉద్యమ సమయంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన మంత్రి పదవిని త్యాగం చేసి తెలంగాణ ఉద్యమానికి జీవం పోశారని, అప్పటి ఎంపీలైన పొన్నం ప్రభాకర్, వివేక్, రాజగోపాల్ లాంటి పెద్దలు పార్లమెంటులో తెలంగాణ కోసం కొట్లాడారని గుర్తుచేశారు. తెలంగాణ రాకపోతే బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news