బ్రేకింగ్ : ఈ నెల 14 నుంచి కాంగ్రెస్ పార్టీ పాదయాత్ర

-

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఈ నెల 14 నుండి 21 వరకు జన జాగరణ ప్రజా చైతన్య పాదయాత్ర లు చేపట్టనుందని… పిసిసి క్రమశిక్షణ సంఘం ఛైర్మెన్ చిన్నారెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్ ల పర్మిషన్ లు తీసుకొని ఈ యాత్రలు నిర్వహించాలన్నారు చిన్నారెడ్డి. జిల్లా కలెక్టర్ లు అనుమతులు ఇవ్వకుంటే.. గాంధీ భవన్ కు ఫిర్యాదు చేయాలని వెల్లడించారు.

31 జిల్లాలకు 50, 60 మంది కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఇంఛార్జి లుగా, డీసీసీ ప్రెసిడెంట్ లు కన్వీనర్ లుగా వుంటారని ఆయన స్పష్టం చేశారు. భట్టి , రేణుకా చౌదరి ఖమ్మం జిల్లాలో.. వికారాబాద్ లో రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమానికి ఇన్‌ చార్జీ గా వ్యవహరిస్తారని తెలిపారు పిసిసి క్రమశిక్షణ సంఘం ఛైర్మెన్ చిన్నారెడ్డి. మెదక్ జిల్లాలో దామోదర్ రాజనర్సింహ, దాసోజు, వరంగల్ లో కొండా దంపతులు, సిరిసిల్ల జిల్లాలో మాజీ ఎంపి రాజయ్య నిర్వహిస్తారన్నారు. కొత్తగూడెం లో.. పొడెం వీరయ్య, నిర్మల్ జిల్లాలో మహేశ్వర్ రెడ్డి ఉంటారని తెలిపారు.  జనగాం జిల్లాలో పొన్నాల అలాగే… ములుగు జిల్లాలో ఎమ్మెల్యే సీతక్క పాదయాత్ర లు నిర్వహిస్తారని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version