నన్నిలా ఎందుకు వేధిస్తున్నావ్ అంటూ సెల్ఫీ … ఇంటికి వెళ్లిన భార్యకు షాక్

-

’నన్నిలా ఎందుకు వేధిస్తున్నావ్.. నేనేం పాపం చేశాను.. గొడవలకు కారణం నువ్వా..? నేనా..? ఓ సారి ఆలోచించుకో.. నేనెప్పుడు నిన్ను ఇబ్బంది పెట్టలేదు..‘ అంటూ సెల్పీ.. తరువాత ఆత్మహత్య. దంపతుల మధ్య జరిగిన గొడవలు ఒకరి మరణానికి కారణమయ్యాయి. భర్తతో గొడవ పడిన భార్య ఇంటి నుంచి బయటకు వెళ్లింది.. ఆతర్వాత వచ్చి సీన్ చూసి లబోదిబోమంది.. వివారాల్లోకి వెళితే..

రాజస్థాన్ లోని భిల్వార్ పట్టణం తిక్రీ గ్రామానికి చెందిన ఖుష్రాజ్ మీనా(30)కి, అదే ప్రాంతానికి చెందిన ప్రియాంకతో ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఖుష్రాజ్ డ్రైవర్ గా పనిచేస్తూ ఇంటిని పోషిస్తున్నాడు. అయితే గత కొంత కాలంగా కుటుంబంలో గొడవలు ఏర్పడ్డాయి. తాజాగా గురువారం కూడా ఖుష్రాజ్, ప్రియాంకలు గొడవ పడ్డారు. భర్తతో గొడవ జరిగిన తర్వాత ఇంటి నుంచి ప్రియాంక బయటకు వెళ్లే క్రమంలో ’బయటకు వెళ్లవద్దని ఏమైనా ఉంటే ఇంట్లోనే మాట్లాడుకుందాం‘ అని ఖుష్రాజ్ ప్రాధేయపడ్డాడు. అయినా వినకుండా ప్రియాంక ఇంటి నుంచి బయటకు వెళ్లింది.

చెప్పినా వినకపోవడంతో  ఖుష్రాజ్ కు తీవ్రంగా మనస్తాపానికి గురయ్యాడు. గుక్కపట్టి ఏడుస్తూ ఓ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. అందులో తనకున్న బాధను మొత్తాన్ని చెప్పుకున్నాడు. ‘నేనేం పాపం చేశాను.. ఎందుకిలా వేధిస్తున్నావ్.. గొడవలు జరగడానికి కారణం నేనా? నువ్వా? నువ్వే ఓసారి ఆలోచించుకో.. నేనెప్పుడు కూడా నిన్ను ఇబ్బంది పెట్టలేదు..’ అని ఏడ్చుకుంటూ చెప్పాడు. ఆ తర్వాత వైర్ ను గొంతును బిగించుకుని ఖుష్రాజ్ ఆత్మహత్య చేసుకున్నాడు. కాసేపటి తరువాత ఇంటికి వచ్చిన ప్రియాంక భర్త పడి ఉండటం చూసి ఆత్మహత్య చేసుకున్నాడని భోరున విలపించింది. అరుపులు విన్న చుట్టుపక్కల ప్రజలు కూడా వచ్చారు. భర్త సెల్ ఫోన్ లో ఉన్న వీడియోను చూపి ఏడ్చింది.

 

సంఘటన స్థలానికి చేరుకున్న హనుమాన్ నగర్ పోలీసులు కేసును నమోదు చేసుకుని ధర్యాప్తు  చేస్తున్నారు.   పోలీస్ స్టేషన్ ఇంచార్జ్ మహమ్మద్ ఇమ్రాన్ మాట్లాడుతూ భార్యభర్తల మధ్య నిత్యం గొడవలు జరిగేవని, గురువారం కూడా మరోసారి గొడవ జరగడంతో ఖుష్రాజ్ ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version