Breaking : రేపు గాంధీ భవన్ లో సత్యాగ్రహ దీక్ష

-

కేంద్రం ప్రవేశపెట్టిన అగ్నిపథ్‌ జ్వాలలు ఇంకా రగులుతూనే ఉన్నాయి. తెలంగాణలో నిన్న సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో చోటు చేసుకున్న అలర్లు దానికి నిదర్శనం. అయితే అగ్నిపథ్‌ స్కీంను వెనక్కి తీసుకోవాలంటూ విమర్శలు వెల్లువెత్తుతుంటే.. మరో పక్క కేంద్ర ప్రభుత్వం ఎయిర్‌ఫోర్స్‌ లాంటి విభాగాల్లో అగ్నివీరులకు ప్రత్యేక కేటాయింపు ఇస్తామంటూ ప్రకటనలు చేస్తోంది. ఈ నేపథ్యంలో రేపు గాంధీ భవన్ లో సత్యాగ్రహ దీక్ష చేపట్టనున్నట్లు టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్, ఇంచార్జ్ ఆర్గనైజేషన్ మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. అగ్నిపథ్ పేరుతో కొత్త పథకం తీసుకువచ్చి సైన్యంలో చేరాల్సిన యువతను తీవ్రంగా అవిమానపరిస్తూ సైన్యంలో కూడా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ లాగా చేస్తూ యువత ను నిర్వీర్యం చేస్తున్నారని ఆయన అన్నారు.

అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలని ఏఐసీసీ పిలుపులో భాగంగా రేపు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు గాంధీ భవన్ లోని గాంధీ విగ్రహం వద్ద సత్యాగ్రహ దీక్ష నిర్వహించ తలపెట్టినట్లు ఆయన వెల్లడించారు. అయితే ఈ సత్యాగ్రహ దీక్షకు కాంగ్రెస్‌ శ్రేణులు, కార్యకర్తలు భారీగా తరలిరండని పిలుపునిచ్చారు. అగ్నిపథ్‌ రద్దేయ్యే వరకు పోరాటంలో పాల్గొనండని ఆయన వ్యాఖ్యానించారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version