రేసులో కాంగ్రెస్..రేవంత్ టార్గెట్ రీచ్?

-

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్తితి కాస్త విచిత్రంగా ఉందని చెప్పొచ్చు…అసలు ఆ పార్టీ ఒకోసారి బాగా హైలైట్ అవుతుంది…లేదంటే అడ్రెస్ ఉండటం లేదు. దీంతో తెలంగాణలో రాజకీయ యుద్ధం పూర్తిగా టీఆర్ఎస్-బీజేపీ మధ్యే నడుస్తోంది..ఇలా రెండు పార్టీల మధ్య వార్ నడుస్తుంటే…కాంగ్రెస్ ఏమో ఎక్కువ ప్రేక్షక పాత్ర పోషిస్తున్నట్లు కనిపిస్తోంది. కానీ టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు పార్టీని బలోపేతం చేయడానికి చూస్తున్నారు…కాకపోతే పార్టీలో ఉన్న అంతర్గత విభేదాల వల్ల…కాంగ్రెస్ రేసులో ఉండటం లేదు. దీని వల్ల కాంగ్రెస్ పార్టీకి క్షేత్ర స్థాయిలో బలం ఉన్నా సరే..పెద్దగా ఉపయోగం లేకుండా పోతుంది.

అయితే రేవంత్ రెడ్డి..తన రాజకీయ వ్యూహాలని పదును పెడుతూ…పార్టీని పైకి లేపాలనే చూస్తున్నారు..తాజాగా కూడా కాంగ్రెస్ పార్టీ ఛలో రాజ్ భవన్ కార్యక్రమం…ఓ రకంగా కాంగ్రెస్ హైలైట్ అవ్వడానికి కారణమైందని చెప్పొచ్చు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఈడీ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ….కాంగ్రెస్ శ్రేణులు దేశ వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టిన విషయం తెలిసిందే…అయితే దేశంలో ఎక్కడా కూడా ఆందోళన కార్యక్రమాలు కాస్త విధ్వంసానికి దారి తీయలేదు…కానీ తెలంగాణలో అలా కాదు…ఊహించని విధంగా కాంగ్రెస్ శ్రేణులు విధ్వంసానికి పాల్పడ్డాయి.

సాటిన్యూతంగా రాజ్‌భవన్‌ వరకు ప్రదర్శనగా వెళ్లేందుకు కాంగ్రెస్ శ్రేణులు చేసిన ప్రయత్నాలను పోలీసులు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో ఎక్కడకక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు రెచ్చిపోయారు. ఓ బైకుకు నిప్పు పెట్టారు…బస్సు అద్దాలు ధ్వంసం చేశారు..అలాగే కాంగ్రెస్ నాయకులపై పోలీసులు లాఠీ చార్జ్ చేశారు.

అయితే ఈ కార్యక్రమం వల్ల కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అయిందో…మైనస్ అయిందో తెలియదు గాని..దీని వల్ల కాంగ్రెస్ పార్టీ కూడా రేసులో ఉందని మాత్రం తెలిసింది..ఇప్పటివరకు టీఆర్ఎస్-బీజేపీల మధ్యే వార్ నడుస్తున్నట్లు కనిపిస్తోంది…ఈ ఒక్క ఆందోళన కార్యక్రమం తర్వాత కాంగ్రెస్ కూడా హైలైట్ అయింది…టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి టార్గెట్ కూడా అదే అయి ఉంటుంది….తమ అధినేతల కోసం పోరాడినట్లు ఉంటుంది…అలాగే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని రేసులోకి తీసుకొచ్చి ఉంటుందని చెప్పి….అనూహ్యంగా ఆందోళన కార్యక్రమం కాస్త ఉద్రిక్తతల మధ్య కొనసాగేలా చేశారు..మొత్తానికైతే తెలంగాణలో కాంగ్రెస్ కూడా ఫామ్ లోకి వచ్చిందని చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version