బీజేపీ సర్కారుపై ఖర్గే ఫైర్

-

కేంద్రంలోని బీజేపీ సర్కారుపై కాంగ్రెస్‌ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే మరోసారి తన ఆగ్రహం వ్యక్తం చేసారు. దేశంలో వాక్‌ స్వాతంత్య్రం లేకుండా పోయిందని ఆయన మండిపడ్డారు. ఈరోజు జార్ఖండ్‌లోని సాహెబ్‌గంజ్‌ జిల్లాలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. పార్లమెంటులో తాను చేసిన ప్రసంగంలోని కొన్ని భాగాలను తొలగించారని ఖర్గే మండిపడ్డారు.

దేశంలో పార్లమెంట్‌లోపలగానీ, పార్లమెంట్‌ బయటగానీ వాక్‌ స్వాతంత్య్రం లేదని ఖర్గే అన్నారు. ఎవరైనా ధైర్యం చేసి మాట్లాడితే వాళ్లను జైలుకు పంపుతున్నారని విమర్శించారు. దేశంలో ద్రవ్యోల్బణాన్ని అరికడతామని చెప్పి 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిందని, కానీ అప్పటి నుంచి నిత్యావసర వస్తువుల ధరలతోపాటు, పేదరికం పెరుగుతూనే ఉన్నదని వెల్లడించారు.

సాహెబ్‌గంజ్‌ జిల్లా పాకూర్‌ పట్టణంలోని గుమానీ గ్రౌండ్‌లో 60 రోజులపాటు కొనసాగే హాత్‌ సే హాత్‌ జోడో కార్యక్రమం ప్రారంభం అనంతరం ఆయన ప్రసంగించారు. హాత్‌ సే హాత్ జోడో యాత్రలో భాగంగా కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు ఇంటింటికి తిరిగి కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల గురించి మాట్లాడనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version