Breaking : రాఘవరెడ్డి కి 10 రోజుల ఈడీ కస్టడీ

-

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన.. మాగుంట రాఘవరెడ్డి కి 10 రోజుల ఈడీ కస్టడీకి రౌస్ అవెన్యూ కోర్టు అనుమతిచ్చింది. ఈడీ కస్టడీని రాఘవ తరపు న్యాయవాది వ్యతిరేకించారు. జ్యుడీషియల్ కస్టడీ కి ఇవ్వాలని కోర్టును అయన వేడుకున్నారు. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద నిందితులను ఈడీ కస్టడీకి అనుమతించవచ్చని ఈడీ తరపు న్యాయవాది వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి నరేష్ కుమార్ లాకా.. మాగుంట రాఘవరెడ్డికి 10 రోజుల ఈడీ కస్టడీకి అనుమతి ఇవ్వడం జరిగింది. అలాగే రాఘవరెడ్డిని ప్రతిరోజూ గంటపాటు కలిసేందుకు కుటుంబసభ్యులకు న్యాయమూర్తి అనుమతిచ్చారు. ఇంటి నుంచి భోజనం తీసుకునేందుకు కోర్టు నిరాకరించింది.

తదుపరి విచారణ ఫిబ్రవరి 21కి వాయిదా కోర్టు వేయడం జరిగింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి తనయుడు మాగుంట రాఘవరెడ్డిని ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సౌత్ గ్రూప్‌లో మాగుంట రాఘవరెడ్డి కీలక పాత్ర పోషించినట్టు సమాచారం. దీనికి సంబంధించిన అన్ని మీటింగ్‌ల్లోనూ మాగుంట పాల్గొన్నట్టు తెలియవచ్చింది. విచారణలో రాఘవరెడ్డి చాలా సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇటీవల పంజాబ్‌కు సంబంధించి ఛారియట్ మీడియా అధినేత రాజేష్ జోషి అనే వ్యక్తిని అరెస్ట్ చేసారు.

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవిత మాజీ ఆడిటర్‌ గోరంట్ల బుచ్చిబాబు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి కోర్టు అనుమతిచ్చింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బుచ్చిబాబును అరెస్టు చేసింది సీబీఐ. ఈ కేసులో తెలంగాణ నుంచి అభిషేక్‌ బోయినపల్లి తర్వాత సీబీఐ అరెస్టు చేసిన రెండో వ్యక్తి బుచ్చిబాబే కావడం గమనార్హం. ఈ కేసు విచారణలో భాగంగా బుచ్చిబాబు నుంచి మరింత సమాచారాన్ని రాబట్టేందుకు కస్టడీకి ఇవ్వాలని సీబీఐ అధికారులు కోర్టును కోరారు. బుచ్చిబాబు మద్యం విధానం కుట్రలో భాగస్వామి అని, సహ నిందితులతో కలిసి పలుమార్లు భేటీల్లో పాల్గొన్నారని సీబీఐ తరుపు న్యాయవాదులు కోర్టుకు వివరించారు. బుచ్చిబాబు చాలా తీవ్రమైన నేరానికి పాల్పడ్డారని, బుచ్చిబాబును జ్యుడీషియల్ కస్టడీకి పంపాలని కోరింది సీబీఐ.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version