తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీపై దానికి అంతర్గతంగా మద్దతు ఇస్తున్న ఎంఐఎం పార్టీ తీవ్రంగా ఫైర్ అయ్యింది. ఆ పార్టీ ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఓ పబ్లిక్ మీటింగులో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ వాళ్లు అంబేద్కర్ ఫోటోలు పట్టుకొని తమాషాలు చేస్తున్నారని మండిపడ్డారు.
కాంగ్రెస్ వాళ్ళకి అసలు అంబేద్కర్ ఫోటో పట్టుకొనే అర్హత లేదని, ఇచ్చిన గ్యారెంటీలు అమలు చెయ్యడానికి చేతకాదని దుయ్యబట్టారు.కాంగ్రెస్ దళితులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.ఆ తర్వాతే అంబేద్కర్ ఫోటోను పట్టుకోవాలని ఎంఐఎం ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీకి మద్దతు తెలుపుతున్న ఎంఐఎం నేరుగా విమర్శించడం ప్రస్తుతం రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.