కొత్త సంవత్సరం వేడుకలను ఒక్కొక్కరు ఒక్కోలా జరుపుకుంటుంటారు. కొందరు ఫ్రెండ్స్‌తో జరుపుకుంటే మరికొందరు కుటుంబ సభ్యులతో జరుపుకుంటుంటారు. ఇక పొలిటికల్ లీడర్స్ ఏదైనా ఈవెంట్ లేదా తమ పార్టీ కార్యాలయాల్లో న్యూ ఇయర్ వేడుకలను సెలబ్రేట్ చేసుకుంటుంటారు. కానీ, బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు మాత్రం మరోసారి తన సింప్లిసిటీని చాటుకున్నారు.
ఆయన గత 15 సంవత్సరాలుగా ప్రభుత్వ హాస్టల్లో విద్యార్థులతో కలిసి న్యూ ఇయర్ వేడుకలను జరుపుకుంటున్నారు. అదేవిధంగా నిన్న సాయంత్రం సిద్ధిపేట జిల్లాలోని తడకపల్లి బీసీ బాలుర హాస్టల్లో విద్యార్థులతో కలిసి మాజీ మంత్రి హరీష్ రావు భోజనం చేశారు. అనంతరం వారితో కలిసి కొత్త సంవత్సరానికి వెల్ కమ్ చెప్పారు. మాజీ మంత్రి రాకతో విద్యార్థుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.