పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ హత్యకు కుట్ర..!

-

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్​ను హత్య చేయడానికి కుట్ర జరుగుతోందని సమాచారం. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే చెప్పారు. ఉగ్రవాదులతో తనను హత్య చేయించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని.. ఇందుకోసం ఓ ఉగ్ర సంస్థకు భారీగా నగదు ఇచ్చారని ఇమ్రాన్‌ఖాన్‌ పేర్కొన్నారు. ఈ కుట్ర వెనుక మాజీ అధ్యక్షుడు ఆసిఫ్‌ అలీ జర్దారీ పాత్ర ఉందని ఆరోపించారు.

సింధ్‌ ప్రభుత్వం నుంచి అక్రమంగా ఆర్జించిన సొమ్మును తనను చంపడానికి జర్దారీ ఉపయోగిస్తున్నారని ఇమ్రాన్ ఆరోపించారు. గతంలో తనపై దాడికి కుట్ర పన్నిన వారికీ ఇందులో భాగస్వామ్యం ఉందని తెలిపారు. ‘‘ఇప్పుడు ప్లాన్‌ ‘సి’ అమలు చేస్తున్నారు. దీని వెనుక ఆసిఫ్‌ జర్దారీ ఉన్నారు. అతని దగ్గర లెక్కలేనంత అవినీతి సొమ్ము ఉంది. ఆ డబ్బును ఆయన ఓ ఉగ్రసంస్థకు ఇచ్చారు. ఈ మొత్తం కుట్రలో శక్తిమంతమైన ప్రభుత్వ ఏజెన్సీల పాత్ర కూడా ఉంది’’ అని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version