కామారెడ్డి జిల్లా బిక్నూర్‌లో కానిస్టేబుల్ వీరంగం

-

కామారెడ్డి జిల్లా బిక్నూర్‌లో కానిస్టేబుల్ వీరంగం సృష్టించాడు. సొంత తమ్ముడు, అతడి భార్య నవ్య, పిల్లలపై మద్యం మత్తులో కానిస్టేబుల్ సంతోష్ గౌడ్ దాడికి పాల్పడ్డాడు. అడ్డుకోవడానికి వచ్చిన ఇరుగు పొరుగు వారిపై కూడా దాడికి పాల్పడినట్లు తెలిసింది.కుటుంబ కలహాలే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

అయితే, పోలీస్‌స్టేషన్లో అతనిపై ఫిర్యాదు చేస్తుండగా.. తాను కానిస్టేబుల్ అని, తనను ఎవరు ఏం చేయలేరని సంతోష్ గౌడ్ మాట్లాడినట్లు తెలుస్తోంది. ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు గన్‌మెన్‌గా సంతోష్ గౌడ్ విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. తల్లిని తీసుకెళ్లడానికి వచ్చిన తమ్ముడి కుటుంబ సభ్యులు, అడ్డుకోవడానికి వచ్చిన వారిపై దాడి చేస్తున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news