ఈ సింపుల్ టిప్స్ తో ఒత్తిడిని తగ్గించుకోండిలా…..!

-

ఒత్తిడితో సతమతమవుతున్నారా? ఒత్తిడిని ఎలా తగ్గించుకోవాలో అర్థం కావట్లేదా? ఒత్తిడి వల్ల ఏ పనీ సరిగ్గా చేయలేకపోతున్నారా? అయితే.. మీకోసమే ఈ వార్త.

ఒత్తిడి అనేది ఇప్పుడు ప్రతి మనిషి జీవితంలో భాగం అయిపోయింది. కార్టిసాల్ అనే హార్మోన్ వల్ల ఒత్తిడి పెరుగుతుంది. అయితే.. కార్టిసాల్ ఎంత స్థాయిలో ఉత్పత్తి అవ్వాలి.. దాన్ని ఎలా అంచనా వేయాలి అంటే మాత్రం డాక్టర్ల దగ్గర సరైన సమాధానం లేకుండె ఇదివరకు. అందుకే ఒత్తిడిని తగ్గించుకోవడమనేది ఓ సవాల్ గా మారింది. అయితే ఇప్పుడు చెమట ద్వారా కార్టిసాల్ స్థాయిని తెలుసుకోవచ్చట. అంటే.. బయో సెన్సార్ ప్యాచ్ అనే ఓ పరికరంతో చెమట ద్వారా కార్టిసాల్ శాతాన్ని లెక్కిస్తారట. దాన్ని బట్టి పిట్యూటరీ, అడ్రినల్ గ్రంథుల పనితీరును కరెక్ట్ గా లెక్కించడానికి వీలవుతుందట. దాన్ని బట్టి కార్టిసాల్ శాతాన్ని కంట్రోల్ లో ఉంచుకొని ఒత్తిడిని దూరం చేసుకోవచ్చట.

ఈ బయో సెన్సార్ ప్యాచ్ అనే పరికరాన్ని మన చర్మానికి అతికించుకొని ఓ 20 నిమిషాల పాటు నడిచినా, పరిగెత్తినా కార్టిసాల్ శాతం తెలుస్తుందట. శరీరం నుంచి వచ్చే చెమటలోని పొటాషియం, సోడియం అయాన్ల ఆధారంగా కార్టిసాల్ శాతాన్ని లెక్కిస్తారట. ఈ పరిశోధనను స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన రీసెర్చర్స్ కొంతమంది మీద ప్రయోగించి నిరూపించారట. అయితే.. ఇది ఇంకా మనదేశానికి రాలేదు. తొందరలోనే ఈ పరికరం మన దేశానికి రానున్నదట. ఇక.. ఈ పరికరం మన దేశానికి వచ్చిందటే ఒత్తిడిని జయించడానికి ఓ మంచి చికిత్స దొరికినట్టే.

Read more RELATED
Recommended to you

Exit mobile version