వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో అరెస్టు అయిన నటి కస్తూరిని పోలీసులు చెన్నయ్ తరలించారు. ఇటీవల తమిళనాడులో జరిగిన ఓ రాజకీయపార్టీ సభలో నటి కస్తూరి తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.దీంతో ఆమెపై పలువురు కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలో శనివారం చెన్నై పోలీసులు ఆమెను సైబరాబాద్ పరిధిలోని రాజేంద్రనగర్లో అరెస్టు చేశారు.
తాజాగా ఆమెను సైబరాబాద్ నుంచి చెన్నైకి తరలించారు. అరెస్టు భయంతో.. కస్తూరి ముందస్తు బెయిల్ కోసం మూడ్రోజుల క్రితం మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. కానీ ఆమెకు కోర్టు బెయిల్ నిరాకరించింది. తెలుగు మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసు నుంచి తప్పించుకునేందుకు కస్తూరి ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఆఖరికి అరెస్టు కాక తప్పలేదు. మరోవైపు ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలుగు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.