వివాదాస్పద డైరెక్టర్ రాంగోపాల్ వర్మకు హైకోర్టులో ఊరట లభించింది. సీఐడీ జారీ చేసిన నోటీసులపై స్టే విధిస్తూ.. న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ కోర్టు. ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ అనే సినిమాపై గతంలో ఫిర్యాదులు అందగా.. విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీ చేసింది ఏపీ సీఐడీ. అయితే… ఈ కేసుని కొట్టివేయాలని కోరుతూ.. హైకోర్టులో వివాదాస్పద డైరెక్టర్ రాంగోపాల్ వర్మ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ తరుణంలోనే… ఈ పిటిషన్‌ని విచారించింది హైకోర్టు.. వివాదాస్పద డైరెక్టర్ రాంగోపాల్ వర్మకు ఊరటనిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ హై కోర్టు. తదుపరి చర్యలు 6 వారాల వరకు నిలిపివేయాలని సీఐడీకి ఆదేశాలు ఇచ్చింది. దీంతో వివాదాస్పద డైరెక్టర్ రాంగోపాల్ వర్మకు హైకోర్టులో ఊరట లభించింది.