వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ రామ్ గోపాల్ వర్మ..! వర్మ అంటేనే వివాదం.. వివాదాల ప్రియుడే వర్మ..! తరచూ తన ఫోకస్ అంతా వివాదాలపైనే పెడుతుంటాడు రామ్ గోపాల్ వర్మ వివాదాస్పద సంఘటన ఏదైనా జరిగితే చాలు తాను ఆ అంశాన్ని సినిమాగా తీయబోతున్నానని తన సోషల్ మీడియాలో పోస్టులు చేస్తూఉంటాడు. అయితే తాజాగా నిన్న ఫాదర్స్ డే సందర్భంగా ఓ వివాదాస్పద ట్వీట్ చేశాడు ఆర్‌జీవీ. ఈ ట్వీట్లో తాను గతంలో జరిగిన ప్రణయ్ అమృతల అంశాన్ని లేవనెత్తాడు.. ఫాదర్స్ డే సందర్భంగా సాయంత్రం 5 గంటలకు హ్యాపీ ఫాదర్స్ డే అంటూ ఓ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశాడు. ఆ ఫాస్ట్ లుక్ లో ఉన్న క్యారెక్టర్స్ అచ్చం అమృత మరియు తన తండ్రి మారుతి రావును పోలినట్టుగా ఉండటమే సంచలన అంశం, పైగా ఆ చిత్రానికి మర్డరర్ అనే టైటిల్ ఉండటం కుటుంభ కథా చిత్రం అంటూ శీర్షిక ఉండటం సంచలనాన్ని సృష్టించిన ప్రధాన అంశాలు.
This is going to be a heart wrenching story based on the Amrutha and Maruthi Rao saga of the DANGERS of a father LOVING a daughter too much ..Launching the poster of a SAD FATHER’S film on HAPPY FATHER’S DAY #MURDERlove pic.twitter.com/t5Lwdz3zGZ
— Ram Gopal Varma (@RGVzoomin) June 21, 2020
ఇక వర్మ విడుదల చేసిన ఫస్ట్ లుక్ ను అస్సలు జీర్ణించుకోలేకపోయింది అమృత..! అమృత స్పందిస్తూ.. వర్మ డబ్బుకోసం ఇంత నీచానికి దిగజారుతాడని అస్సలు ఊహించలేదని, ఆ ఫస్ట్ లుక్ ని చూడగానే ఆత్మహత్య చేసుకోవాలని అనిపించిందని ఆమె వాపోయారు. ఇప్పటికే ఎన్నో ఇలాంటి బాధలను ఎన్నో తట్టుకొని నిలబడ్డానని ఇదో పెద్ద లెక్క కాదని ఆమె తేల్చి చెప్పారు. వర్మ పై ఎలాంటి కేసు కూడా పెట్టనని తన పాపానికి తాననే వదిలేస్తున్నానని ఆమె అన్నారు. ఆడదాన్ని ఎలా గౌరవించాలో కూడా నేర్పనీ తల్లి వర్మకి ఉన్నందున జాలి పడుతున్నానని ఆమె రాసిన నోట్ లో పేర్కొన్నారు. డబ్బుకోసం ఇలా దిగజారినందుకు వర్మకి రెస్ట్ ఇన్ పీస్ అంటూ ఆమె సంచలన రాతలు రాశారు.
I wanted to answer to a widely circulated note on the social media claiming to be written by Amrutha, that she felt like committing suicide after she came to know that I am making a film called MURDER based on her and her father’s story pic.twitter.com/4eG06ZL3Xp
— Ram Gopal Varma (@RGVzoomin) June 22, 2020
Whether Amrutha wrote it or some jobless over enthusiast wrote it , I felt obligated to respond to it to clarify the concerns in the minds of whoever is needlessly concerned about what I will show in MURDER pic.twitter.com/3Gr6pp5p2y
— Ram Gopal Varma (@RGVzoomin) June 22, 2020
Firstly I clearly mentioned in the poster that MURDER is based on a true story and I did not claim it to be the true story ..The news upon which my film is based upon is in the public domain for years and has been acknowledged by the various people involved. pic.twitter.com/Cs5wpJarTR
— Ram Gopal Varma (@RGVzoomin) June 22, 2020
Its foolish to assume that I am going to show someone involved in a negative light because I strongly believe that nobody is bad and only bad circumstances make people look bad or make them behave bad and that’s what I intend to explore in MURDER pic.twitter.com/PGNo3DyOuY
— Ram Gopal Varma (@RGVzoomin) June 22, 2020
ఇక దీనికి స్పందించిన వర్మ తన ట్విటర్ లో ట్వీట్ చేస్తూ.. నేను తీయబోతున్న సినిమా ఫస్ట్ లుక్ చూసి ఆత్మహత్యకు పాల్పడలనుకున్న అమృతని చూసి నేను జాలి పడుతున్నాను. నేను విడుదల చేసిన ఫస్ట్ లుక్ లో యదార్థ కథకి ఆధారంగా తీస్తున్నాను అని చెప్పాను తప్ప ఇది అమృత కథే అని ఎక్కడా అనలేదౌ అని ఆయన పేర్కొన్నారు. నేను అందరికీ తెలిసీన కథలనే ఎంచుకుంటాను తప్ప ఎవ్వరిని కించపరచడానికో ఎవ్వరో చెబితే వారి ఇమేజ్ ని దెబ్బతీయడానికో డబ్బులకో తీయనని ఆయన పేర్కొన్నాడు. పైగా నా సినిమాలోని అంశాలు సినిమా విడుదలయ్యాకే అందరికీ తెలుస్తాయని అనవసరంగా ఊహించుకోవద్దనై ఆయన కౌంటర్ వేశారు. ఇక ఆయన చేసిన ట్వీట్లకి నెటిజన్లు అనేక కోణాల్లో కామెంట్లు చేస్తున్నారు.. ఇప్పుడు ఆయన చేసిన ట్వీట్లు పోస్టర్లు సామాజిక మాద్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
My final message to writer of the note whether it’s Amrutha or anybody else is i have the highest respect for people who endured a tremendous trauma and my sincerety in MURDER will be to respect that pain and lessen it by putting their experience in a contextual retrospective pic.twitter.com/nvT3eELdbb
— Ram Gopal Varma (@RGVzoomin) June 22, 2020