రజనీకాంత్ హీరోగా నటించిన తాజా చిత్రం “కూలీ”. ఈ సినిమా ఆగస్టు 14న థియేటర్లలో విడుదలై మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో కూలీ సినిమా అందుబాటులోకి రానుంది.

లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నాగార్జున, శృతిహాసన్, అమీర్ ఖాన్, సత్యరాజ్, ఉపేంద్ర, సౌబిన్ లాంటి ఇతర నటీమణులు నటించారు. కూలి సినిమాకు అనిరుద్ సంగీతం అందించారు. ఈ సినిమా థియేటర్లలో పేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. మరి ఇప్పుడు ఓటీటీలో ఏ మేరకు విజయం సాధిస్తుందో చూడాలి. ఇదిలా ఉండగా ఈ సినిమా ఫలితాన్ని ఏ మాత్రం పట్టించుకోకుండా హీరో రజనీకాంత్ తన తదుపరి సినిమా షూటింగ్ లో రెగ్యులర్ గా పాల్గొంటున్నారు.