ఏపీలో తగ్గిన కరోనా కేసులు.. 24 గంటల్లో ఇద్దరు మృతి

-

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు తగ్గాయి. క్రమంగా కరోనా తగ్గుముఖం పడుతోంది. దాదాపుగా థర్డ్ వేవ్ ముగిసింది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 18,803 కరోనా టెస్టులు చేయగా.. కేవలం 244 మందికి మాత్రమే కరోనా పాజిటివ్ గా తేలింది. కరోనా కారణంగా ఇద్దరు మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 5565 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఒక్క రోజు వ్యవధిలో 662 మంది వైరస్ బారి నుంచి కోలుకున్నారు. 

మరో వైపు దేశంలో కూడా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గత కొన్ని రోజులుగా కేవలం 30 వేలకు దిగువనే కేసులు నమోదవుతున్నాయి. జనవరిలో గరిష్టంగా 3 లక్షలు దాటిన కరోనా కేసుల సంఖ్య ప్రస్తుతం వేలల్లోనే నమోదవుతుండటం ఊరట కలిగించే అంశం. దేశవ్యాప్తంగా ఓమిక్రాన్, థర్డ్ వేవ్ భయాలు తొలిగిపోయాయి. మరోవైపు వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా జోరుగా సాగుతోంది. ఇప్పటికే రెండు కోట్లకు పైగా మంది టీనేజర్లు వ్యాక్సినేషన్ తీసుకున్నారు. ఇండియాలో అర్హత కలిగిన వారికి 170 కోట్ల కరోన వ్యాక్సిన్ డోసులు అందాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version