గోదావరి జిల్లాలకు వచ్చేసిన కరోనా…?

-

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ఇప్పుడు అన్ని దేశాలను భయపెడుతున్న సంగతి తెలిసిందే. ఊహించని విధంగా ఈ వ్యాధి ప్రపంచ వ్యాప్తంగా అత్యంత వేగంగా విస్తరిస్తుంది. ఇప్పటి వరకు ఒక్క చైనాలోనే దీని బాధితుల సంఖ్యా 20 వేల వరకు ఉందని అంటున్నారు. ఇక మృతుల సంఖ్య కూడా 500 దాటింది. వృద్దులు, చిన్న పిల్లలు అయితే ఈ వ్యాధి దెబ్బకు నరకం చూసే పరిస్థితి.

ఇక మన దేశంలో ఈ వ్యాధి బాధితుల సంఖ్య ముగ్గురుకి చేరగా లక్షణాలతో మాత్రం పలువురు ఆస్పత్రుల్లో చికిత్సలు కూడా పొందుతున్నారు. దీనితో అన్ని రాష్ట్రాల్లో కూడా కేంద్ర ప్రభుత్వం పలు జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇక మన తెలుగు రాష్ట్రాలలో కూడా కరోనా వైరస్ కేసులు అంటూ ప్రచారం జరుగుతుంది. హైదరాబాద్ లో ల్యాబ్ కి కూడా కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే తాజాగా తూర్పు గోదావరి జిల్లాలో కరోనా వైరస్ కలకలం రేగింది. తూర్పుగోదావరి జిల్లాలో కరోనా లక్షణాలు ఒక వ్యక్తికి బయటపడ్డాయి. ఇటీవల చైనా నుంచి వచ్చిన వ్యక్తి తీవ్రమైన గొంతునొప్పితో బాధపడుతున్న నేపధ్యంలో స్థానిక ప్రభుత్వాసుపత్రి వైద్యులు అతన్ని వెంటనే పరిశీలనలో పెట్టారు. ఆయన నుంచి రక్త నమూనాలను సేకరించి పుణెలోని ల్యాబ్‌కు పంపించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version