ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా వైరస్ విజృంభిస్తుంది. గత కొద్ది రోజుల క్రితం ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా వ్యాప్తి తక్కువగా ఉండేది. అయితే గత నెలలో క్రిస్మస్, న్యూయర్ పండుగల తర్వాత కరోనా వైరస్ వ్యాప్తి తారా స్థాయికి చేరుకుంది. ప్రతి రోజు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 4 వేలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. తాజా గా గడిచిన 24 గంటలలో కూడా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 4,570 కరోనా కేసులు నమోదు అయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.
నేడు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు విడుదల చేసిన కరోనా బులిటెన్ ప్రకారం ఈ ఒక్క రోజే రాష్ట్రంలో 4,570 కరోనా కేసులు వెలుగు చూశాయి. అలాగే రాష్ట్రంలో ఈ రోజు కరోనా కాటుకు ఒకరు బలి అయ్యారు. నేడు నమోదు అయిన కరోనా కేసులతో రాష్ట్రంలో ప్రస్తుతం 26,770 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అలాగే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటలలో 30,022 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. అయితే ఏపీలో కరోనా కేసులు శనివారంతో పోలిస్తే.. కొంత వరకు తగ్గాయి. కాగ శనివారం రాష్ట్రంలో 4,955 కొవిడ్ కేసులు వెలుగు చేశాయి.