ఇండియాలో మళ్లీ కరోనా ఉధృతి

-

దేశవ్యాప్తం కరోనా ఉధృతి మళ్లీ పెరిగింది. టీకా అందుబాటులోకి వచ్చాక.. కొంతమేరా కరోనా తగ్గుముఖం పట్టినా.. మళ్లీ కొవిడ్ పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా భారతదేశంలో కొత్తగా 16,577 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య మొత్తంగా 1,10,63,491కి చేరింది. నిన్న ఒక్కరోజే 120 మంది కరోనా బారిన పడి ప్రాణాలు విడిచారు. దీంతో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 1,56,825కు పెరిగింది. గడిచిన 24 గంటల్లో 12,179 మంది కరోనా నుంచి క్యూర్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 1,55,986 యాక్టివ్‌ కేసులున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

కరోనా వైరస్

తెలంగాణలో..
గడిచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా 189 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు 2,98,453 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే 129 మంది కరోనా నుంచి క్యూర్ అయ్యారు. దీంతో వీరి సంఖ్య 2,94,911కి పెరిగింది. ఇప్పటివరకు 1,632 మంది కరోనా బారిన పడి ప్రాణాలు విడిచారు. ప్రస్తుతం 1,910 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. అయితే కరోనా పరీక్షలు, వ్యాక్సిన్ వేయించుకోవాలనుకునే బాధితులు తమ పేర్లను ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. లేదా నేరుగా ఆస్పత్రికి వెళ్లి పేరు నమోదు చేసుకోవాలి. ఆస్పత్రికి వెళ్లేటప్పుడు ఆధార్ కార్డు తప్పనిసరిగా తీసుకెళ్లాలి.

ఆంధ్రప్రదేశ్‌లో..
తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో 96 కరోనా కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 8,89,681కి చేరింది. కరోనాతో నిన్న ఒక్కరోజే ఒకరు మాత్రమే చనిపోయాడు. దీంతో మరణించిన వారి సంఖ్య 7,169కి పెరిగింది. 71 మంది కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటివరకు క్యూర్ అయిన వారి సంఖ్య 8,81,877కి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 635 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

ప్రపంచవ్యాప్తంగా..
అమెరికాలో నిన్న ఒక్కరోజే 72,195 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2.91 కోట్లకు చేరింది. గడిచిన 24 గంటల్లో 1,869 మంది ప్రాణాలు కోల్పోగా.. మొత్త మరణాల సంఖ్య 5.22 లక్షలకు చేరింది. పాజిటివ్ కేసుల నమోదులో ప్రపంచంలో అమెరికా మొదటి స్థానంలో ఉంది.
కరోనా కొత్త కేసుల నమోదులో అమెరికా తర్వాత బ్రెజిల్ రెండో స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానంలో ఫ్రాన్స్, ఇటలీ, ఇండియా ఉన్నాయి.
కరోనా మరణాల్లో అమెరికా మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానంలో బ్రెజిల్, మెక్సికో, రష్యా, జర్మనీ దేశాలు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version