త్వరలోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని ప్రకటించారు మంత్రి అచ్చెన్నాయుడు. అతివృష్టి కారణంగా ఆంధ్రప్రదేశ్ రైతులు చాలా నష్టపోయారని తెలిపారు. భారీ వర్షాల కారణంగా చాలా జిల్లాలలో లక్షల హెక్టార్లలో పంట నష్టమైందని మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు. ఇప్పటికే 54 కరువు మండలాలను ప్రకటించామని గుర్తు చేశారు. 1.44 లక్షల మంది రైతులు తీవ్రంగా నష్టపోయారని కూడా గుర్తు చేశారు. వీరందరికీ పరిహారంగా 1509.2 కోట్లను మంజూరు చేయబోతున్నట్లు వివరించారు.
ఈ డబ్బులను అతి త్వరలోనే రైతుల ఖాతాలలో వేస్తామని కూడా హామీ ఇచ్చారు మంత్రి అచ్చెన్నాయుడు. గత ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని అస్తవ్యస్తం చేసిందన్నారు. ఐదేళ్లలో ఒక్క సారి కూడా భూసారం పరీక్షలు చేయలేదని ఫైర్ అయ్యారు. రైతులకు సబ్సిడీ యంత్రాలు ఇవ్వలేదన్నారు. చంద్రబాబు…. వ్యవసాయ రంగం పై ప్రత్యేక దృష్టి పెట్టారని తెలిపారు మంత్రి అచ్చెన్నాయుడు. రైతులు సహకారం అందించి వ్యవసాయానికి పూర్వ వైభవం తీసుకొస్తామని ప్రకటించారు మంత్రి అచ్చెన్నాయుడు.