తెలంగాణలో అలెగ్రో మైక్రో సిస్టమ్ ఆర్అండ్‌ఆర్ సెంటర్ ఏర్పాటు : మంత్రి శ్రీధర్ బాబు

-

తెలంగాణలో అలెగ్రో మైక్రో సిస్టమ్ ఆర్ అండ్ ఆర్ సెంట్ ఏర్పాటు కాబోతుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. పలు అంతర్జాతీయ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని పేర్కొన్నారు. తెలంగాణలో పెట్టుబడులకు చాలా అవకాశాలు ఉన్నాయని, ఇన్వెస్టర్లకు ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని వెల్లడించారు.

అలెగ్రో మైక్రో సిస్టమ్‌తో శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ఎంవోయూ (MOU) కుదుర్చుకుంది. ఈ మేరకు మంత్రి శ్రీధర్ బాబుతో ఆ సంస్థ సీఈవో వినీత్, సంస్థ ప్రతినిధుల బృందం నగరంలో భేటీ అయ్యారు. అనంతరం ఈ అవగాహన ఒప్పందానికి సంబంధించిన వివరాలను ఆ సంస్థ సీఈవోతో కలిసి మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. రాష్ట్రంలో సెమీ కండక్టర్‌లకు సంబంధించి ఆర్అండ్‌డీ సెంటర్‌ను ఏర్పాటు చేయబోతున్నట్లు పేర్కొన్నారు.ఈ సెంటర్ ఏర్పాటుతో 500 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు అలెగ్రో మైక్రో సిస్టమ్స్ ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version