హమ్మయ్య ఇండియా సేఫ్ జోన్ లోనే ఉన్నట్టా…

-

దేశంలో కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ఆలోచన చేస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు వస్తున్న వార్తలు చూస్తే దేశంలో కరోనా మరణాలు చాలా తక్కువగా ఉన్నాయి. కరోనా కేసులు 1.73 కోట్లకు పైగా ఉన్నాయి. అయితే 1.95 లక్షల మంది మాత్రమే మన దేశంలో ప్రాణాలు కోల్పోయారు. అంటే భారతదేశంలో కోవిడ్ -19 కేసుల మరణాల రేటు (సిఎఫ్ఆర్) 1.12 శాతం ఉంది.

ప్రస్తుతం ఇండియాకు 98.88 శాతం రికవరీ రేటు ఉంది అని లెక్కలు చెప్తున్నాయి. చాలా మంది ఆస్పత్రి అవసరం లేకుండా ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నారు. ఆసుపత్రులలో చేరే వారి సంఖ్య కూడా చాలా తక్కువ అని అంటున్నారు. మొదటి వేవ్ లో 37 శాతం మంది ఆస్పత్రికి వస్తే ఇప్పుడు కేవలం 28 శాతం మంది మాత్రమే ఆస్పత్రికి వస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version